The Teaser Of Rajinikanth's 2.0 Gets Leaked
భారతదేశంలోనే భారీ బడ్జెట్ మూవీ 2.0. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమా టీజర్ లీకైంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ టీజర్ క్లిప్పింగ్స్, స్క్రీన్ షాట్స్ దర్శనమిస్తున్నాయి. 87 సెకెన్ల నిడివి కలిగిన ఈ టీజర్ ప్రస్తుతం వైరల్ అయింది.
అయితే ఈ టీజర్ ను ఎవరైనా లీక్ చేశారా.. లేక మేకర్స్ కావాలనే ఈ పని చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సినిమా విడుదల సంగతి పక్కనపెడితే కనీసం టీజర్ ను కూడా ఇప్పటివరకు విడుదల చేయలేకపోయారు. టీజర్ రిలీజ్ డేట్ నే ఇప్పటికి 3సార్లు వాయిదావేశారు. ఈ నేపథ్యంలో సినిమాపై తగ్గిన హైప్ ను పెంచేందుకు కావాలనే మేకర్స్ ఇలా కొన్ని షాట్స్ లీక్ చేశారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు టీజర్ ఇంకా సిద్ధంకాలేదనే విషయాన్ని లీక్ అయిన వీడియో మరోసారి స్పష్టంచేసింది. టీజర్ తో పాటు సినిమాను ఎడిట్ చేస్తున్న గ్రాఫిక్స్ కంపెనీ ఈ మధ్యే దివాలా తీసింది. ఈ నేపథ్యంలో టీజర్ లీక్ అయింది. దీంతో ఫ్రెష్ గా మరో టీజర్ చేయిస్తారా.. లేక లీక్ అయిన టీజర్ కే గ్రాఫిక్స్ కంప్లీట్ చేసి వదుల్తారా అనేది ఇప్పుడు డౌట్.
సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు, టీజర్ ఎప్పుడొస్తుందో తెలీదు. అప్పటివరకు ఈ లీక్ అయిన టీజర్ తోనే పండగ చేసుకుంటారు రజనీకాంత్ ఫ్యాన్స్. శంకర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 400 కోట్ల రూపాయలకు పైనే (పబ్లిసిటీ ఖర్చు కాకుండా) ఖర్చవుతోంది.
The teaser of Rajinikanth and Akshay Kumar's much-awaited film 2.0 reportedly leaked online, on Sunday morning, sending netizens into an overdrive.
A video clip of over a minute and a half was uploaded on the Internet, which instantly went viral.
Rajinikanth's fans on Twitter had been urging people to stop sharing the teaser leading to #2Point0 trending since morning. "Omg... It's so heartbreaking. How come it is possible. Finally #2point0Teaser leaked. How careless they're. Unexpected. #2Point0," read one of the tweets.
Netizens are speculating that the leaked teaser is 'just temporary VFX clip (work in progress).' S Shankar's magnum opus project is reportedly being made on a budget of Rs. 400 crore.
2.0 is a sequel to 2010's film Enthiran (Robot), headlined by Rajinikanth and also starring Aishwarya Rai Bachchan. Directed by Shankar, 2.0 will mark Akshay Kumar's debut in Tamil cinema. In the sequel Amy Jackson has replaced Aishwarya Rai Bachchan.
Comments
Post a Comment