మాధవీలత సినిమా నిర్మాత


మాధవీలత, నచ్చావులే సినిమాతో తెలుగుతెరకు పరిచయం. కానీ టాలీవుడ్ కు అంతగా నచ్చిన హీరోయిన్ కాలేకపోయింది. అయితే ఇప్పుడు అనుకోకుండా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సినిమా రంగంలో అమ్మాయిలకు హెరాస్ మెంట్ అన్న విషయంపై ఓ టీవీ చానెల్ మాధవీలత బైట్ తీసుకుంది. దానికి గాను మాధవీ లత బైట్ నేం ఖర్మ. ఏకంగా పెద్ద స్పీచ్ నే ఇచ్చింది. అది కూడా నలుగురు శభాష్ మాధవీలత అనేంత చక్కగా, సూటిగా, పద్దతిగా మాట్లాడింది.

''ఇంటస్ట్రీలో నిర్మాతలను తప్పుపట్టలేం. నీకు సినిమా ఇస్తున్నాం కదా? మాకేం ఇస్తావ్ అనే ధోరణి వారిది. స్మూత్ గా అడుగుతారు. సాయంత్రం నువ్వు ఫ్రీనా అని. ఇదే బయట అయితే చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది. కానీ ఇక్కడే బతకాలి కదా?..''
ఇలా చకచకా మాట్లాడేసింది మాధవీలత. ఆమె చేదు అనుభవాలు, బాధలు ఆమె మాటల్లో తొంగిచూసాయి.

Comments