'ఖైదీ నెంబర్ 150' సినిమా పుణ్యమా అని తన పేరు రాయ్ లక్ష్మీ నుంచి రత్తాలుగా మారిపోయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. రత్తాలు తనకు ఇంత పాపులారిటీ తెచ్చిపెడుతుందని తాను ఊహించలేదని చెబుతోందీ బ్యూటీ. ఆ సంగతలా వుంచితే, 'రత్తాలు' బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
You can Also Read this------>సచిన్ కూతురి బాయ్ ఫ్రెండ్ అతడేనా..?
'జూలీ-2' సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పుడో శ్రీకాంత్ హీరోగా 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లక్ష్మీరాయ్ అలియాస్ రాయ్ లక్ష్మీకి హర్రర్ మూవీ 'కాంచన'తోనే స్టార్‌డమ్ లభించిందని చెప్పొచ్చు.
You can Also Read this------>సచిన్ కూతురి బాయ్ ఫ్రెండ్ అతడేనా..?
You Can Also Read this------->మాధవీలత సినిమా నిర్మాత
ఇక, తన తొలి బాలీవుడ్ సినిమా 'జూలీ-2' గురించి చెబుతూ, ఈ సినిమాలో ఓవర్ డోస్ అందాల విందు వుంటుందనే సంకేతాలు పంపింది. అప్పుడెప్పుడో నేహాధూపియా ప్రధాన పాత్రలో రూపొందిన 'జూలీ' అప్పట్లో పెద్ద సంచలనం. ఆ సినిమాకే ఇప్పుడు రాయ్ లక్ష్మీతో 'జూలీ-2' అంటూ సీక్వెల్ చేస్తున్న విషయం విదితమే.
''ఇదేదో వల్గారిటీ కోసమే తీసిన సినిమా కాదు.. 'జూలీ-2'లో ఓవర్ డోస్ గ్లామర్ వుంటుంది, అంతకు మించి భావోద్వేగాలు ఇందులో కీలకం.. హార్ట్ టచ్చింగ్ సన్నివేశాలెన్నో వుంటాయి..'' అంటూ సినిమాలో కొత్త కోణాన్ని బయటపెట్టింది లక్ష్మీరాయ్.
You Can Also Search For------->ఎక్కడెక్కడో వెతికా.....
హార్ట్ టచ్చింగ్ సన్నివేశాల సంగతేమోగానీ, కుర్రకారుకి హార్ట్ బర్న్ అయ్యే 'అడల్ట్ రేటెడ్' సీన్స్ చాలానే వున్నాయన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. అన్నట్టు, హీరోయిన్‌గా లక్ష్మీరాయ్‌కి ఇది 50వ సినిమా అట.
Comments
Post a Comment