అధికారికమే.. ఆఫీసు పని వేళల్లో శృంగారం కోసం రోజూ ఒక గంట విరామాన్ని ప్రకటించారు స్వీడన్ లో. వినడానికి విచిత్రంగా, విడ్డూరంగా, క్రేజీగా ఉన్నా.. స్వీడిష్ టైన్ లో ఇందుకు సంబంధించి ఆదేశాలతో కూడిని ఉత్తర్వులను జారీ చేశారు కూడా! దీని ప్రకారం.. స్వీడన్ లోని ఆ నగరంలో ప్రతి ఆఫీసులోనూ ఉద్యోగులకు సెక్స్ కోసం ప్రతి రోజూ ఒక గంట విరామాన్ని ఇస్తారు. ఆ సమయంలో వాళ్లు బ్రేక్ తీసుకుని తమ పార్ట్ నర్ తో రమించి రావొచ్చు!
ఆ సిటీ మేయర్ చొరవతో ఈ చట్టం రూపకల్పన అయ్యింది. మరి వినడానికి సిల్లీగా, సిగ్గు పడేలా ఉంది కదా.. అంటే దానికి ఆ మేయర్ ఒప్పుకోవడం లేదు. వివిధ పరిశోధనల నేపథ్యంలో.. సెక్స్ కు ఉన్న ప్రాధాన్యతను గ్రహించి తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఆయన ప్రకటించాడు. ఈ విరామాల వల్ల నష్టం ఏమీ లేదని.. ఉద్యోగులకు ఈ విధంగా విరామం ఇవ్వడం ద్వారా.. ఎంతో లాభం ఉంటుందని, వారు ఈ విరామాన్ని తీసుకోవడం ద్వారా ప్రొడక్టివిటీ పెరుగుతుందని కూడా మేయర్ నొక్కి వక్కాణించాడు!
సెక్స్ తో ఎన్నో శారీరక, మానసిక లాభాలు ఉన్నాయనే విషయాన్ని శాస్త్రీయ పరిశోధనలు తేల్చి చెప్పాయని, శృంగారం రిలాక్సేషన్ కు గొప్ప ఔషధం అని, ఆపీసుల్లో పనితో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే ఉద్యోగులు సేదతీరడానికి ఈ విరామం ఉపయుక్తంగా ఉంటుందని మేయర్ చెబుతున్నాడు. ఈ నియమాన్ని ప్రస్తుతం తమ నగరంలో అమలు చేస్తున్నామని.. ముందు ముందు తమ దేశమంతా దీన్ని అమలు చేస్తుందని.. ఆ తర్వాత ప్రపంచం అందిపుచ్చుకుంటుందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
ఆఫీసు పనివేళల్లో బాత్ రూమ్ కు వెళ్లి స్వయంతృప్తిని పొందే ఉద్యోగులు ఉన్నారనే.. విషయాన్ని ఇటీవల కొన్ని స్వీడిష్ సర్వేలు స్పష్టం చేశాయి. ఇదే సమయంలో జనాభా తగ్గిపోతోంది.. పెంచుకోవాల్సిన జాబితాలో కూడా ఆ దేశం ఉంది. ఈ నేపథ్యంలో మేయర్ నిర్ణయానికి మద్దతు దక్కుతోందక్కడ!
Comments
Post a Comment