శునకాలకు ఫీల్డింగ్ ట్రైనింగ్ ఇస్తున్న ధోనీ.. వీడియో చూడండి.. చెప్పిన మాట ఎలా వింటున్నాయో?



టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం కుటుంబంతో ఎక్కువ సేపు గడిపేందుకు సమయం కేటాయిస్తున్నారు. సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు స్వస్తి పలికిన ధోనీ ప్రస్తుతం వన్డే, ట్వంటీ-20 సిరీస్‌లు లేకపోవడంతో ఇంటికి పరిమితమయ్యారు. ధోనీ తన కూతురు జీవా, పెంపుడు కుక్కలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. 

సింహానికి ముద్దు పెట్టిన భారత క్రికెటర్ ఎవరు?

సమంత కట్టిన చీరలో ఓ ప్రేమకథ ... సోషల్ మీడియాలో ఫోటోలు హల్‌చల్

టీనేజీలో లవ్ ఫెయిల్.. సరైన వరుడు దొరకలేదు.. సెల్ఫ్ మ్యారేజ్‌కు రెడీ.. రోమ్‌లో శోభనం..


ధోనీకి బైకులు, శునకాలంటే ఇష్టం. కొత్త స్టైల్ బైకులను తీయడంలో ధోనీకి ఇంట్రెస్ట్ ఎక్కువ. అలాగే శునకాలను పెంచడం వాటితో ఆడుకోవడం అంటే కూడా ధోనీకి ప్రీతి. నిన్నటి నిన్న జీవాతో కలిసి పాకుతున్న వీడియోను పోస్ట్ చేసిన ధోనీ.. తాజాగా తన మూడు పెంపుడు కుక్కలకు ఫీల్డింగ్ ట్రైనింగ్ ఇస్తున్న వీడియోను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. 

ఈ వీడియోలో ధోని తన కుక్కలకు క్యాచ్ ఎలా పట్టాలో చెప్తుండటం.. అవి కూడా అతని మాటలను సీరియస్‌గా వింటున్నట్లు కనిపించాయి. ఈ వీడియోని ధోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాతో షేర్ చేసిన రెండు గంటల్లోనే రెండున్నర లక్షల వ్యూస్ రావడం విశేషం. అంతేగాకుండా ఈ వీడియోకు భారీగా లైక్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. 

Comments